నవంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Announcement of party

Announcement of Party : నెల్లూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : నవంబర్ 02 ; మాజీ ఎంపీ విజయ్ సాయి రెడ్డి మాట్లాడుతూ, కొత్త పార్టీ ప్రకటనపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈనెల 11 వ తేదీన పార్టీ పేరు ప్రకటిస్తామని స్పష్టం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఆ పార్టీని నడిపిస్తామని తెలిపారు. ఆయనతోపాటు ఓవీ రమణ పార్టీని ముందుకు తీసుకెళ్తారని వెల్లడించారు. రాష్ట్ర శ్రేయస్సు, అభివృద్ధి లక్ష్యం అని పేర్కొన్నారు.

భారతీయ జనతా పార్టీతో తన పార్టీకి ఎటువంటి సంబంధం ఉండదని సూచించారు. రూపాయలు లక్ష కోట్ల అప్పు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన పుణ్యమే అని ఆవేదన వ్యక్తం చేశారు. పుట్టే ప్రతి బిడ్డ అప్పుతో పడుతున్నాడని , లా మరియు ఆర్డర్ లేదని అన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page