అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Korra Chandu Naik

— జనసేన దేవరకొండ ఇంచార్జి :– కొర్ర చందు నాయక్.

Korra Chandu Naik : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 28, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా హోటల్ విష్టా గ్రాండ్ లో జనసేన పార్టీ నాయకులు … ఖమ్మం – వరంగల్ – నల్గొండ జిల్లాల పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) ఎమ్మెల్సీ ఎన్నికల సన్నాహక సమావేశం బుధవారం నిర్వహించారు.
ఈ సమావేశానికి జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నిర్వహణ కార్యదర్శి మరియు ఎమ్మెల్సీ అభ్యర్థి గడల శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు ​.

ఈ ఎం ఎల్ సి ఎన్నికల సన్నాహక సమావేశం లో దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, మునుగోడు, నకిరేకల్ నియోజకవర్గాల జనసేన పిఓసి (POC) లు మరియు ముఖ్య నాయకులు పాల్గొని ఎన్నికల కార్యాచరణపై సుదీర్ఘంగా చర్చించారు. ఈసందర్భంగా ​గడల శ్రీనివాసరావు మాట్లాడుతూ…ఖమ్మం – వరంగల్ – నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు (ఎన్రోల్మెంట్) ప్రక్రియలో జనసేన నాయకుడు కోర్ర చందు నాయక్ అత్యధికంగా ఎన్రోల్మెంట్ నమోదు చేయించి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేశారని ప్రశంసించారు. ఈ సందర్భంగా చందు నాయక్ కిప్రత్యేకంగాఅభినందించారు.

ఈ కార్యక్రమంలో దేవరకొండ నియోజకవర్గ కోఆర్డినేటర్ ప్రజిత్ గౌడ్, నరేష్ గౌడ్, బవండ్ల సాయి, కాటేపాక నవీన్, పిట్ల సిద్దు, రవి, వంటేద్దు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page