
—పాలన గాలికి వదిలి, ప్రతిపక్షాలపై బురద. చల్లే ప్రయత్నం.
—అరచేతిలో వైకుంఠం చూపిస్తూ ప్రజలకు మోసం .
—రైతులకు నీటి సరఫరా, విద్యుత్ సరఫరా సరిగా చేయక నట్టేట ముంచిన వైనం .
–నిత్యావసరాల ధరలు ఆకాశానికి, సామాన్యులకు శాపంలా మారింది.
–దేవరకొండ మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్
Ramavath Ravindra Kumar : త్రినేత్రం న్యూస్ : కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు 420 హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందని, వెయ్యి రోజులు గడుస్తున్నా ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ విమర్శించారు.బుధవారం దేవరకొండ పట్టణంలోని పార్టీ కార్యాలయంలో నేరడుగొమ్ము మండలం
కాచారాజుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని బీచ్యు నాయక్ తండాకు చెందిన పలువురు దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఆయన వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ….ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా కాంగ్రెస్ నాయకులు ప్రజలకు ముఖం చాటేస్తున్నారని ఆయన అన్నారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రజా సంక్షేమం, వ్యవసాయం, విద్యుత్, తాగునీరు వంటి రంగాల్లో తెలంగాణ గణనీయమైన అభివృద్ధి సాధించిందని రవీంద్ర కుమార్ పేర్కొన్నారు
ఇప్పుడున్న ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ప్రజలను తప్పు తోవ పట్టే ప్రయత్నం చేస్తున్నారని , పాలన గాలికి వదిలి ప్రతిపక్షాలపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని, ప్రజలంతా గమనిస్తున్నారని సరైన సమయం లో తగిన గుణపాఠం చెబుతారని, ప్రజలంతా రాబందుల పాలన పోయి కే సి ఆర్ పాలనకావాలనికోరుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు వడత్య బాలు, గోవింద్ తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe