
Graduate MLC Voter Registration : డిండి, (గుండ్లపల్లి) అక్టోబర్ 28 , త్రినేత్రం న్యూస్. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానానికి నిర్వహించబోయే ఎన్నికలలో( వరంగల్ , ఖమ్మం , నల్గొండ ,) భాగంగా ఓటరు నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ అధ్యక్షులు దొంతినేని వెంకటేశ్వరరావు, ముత్యాల శశిధర్ రెడ్డి తెలిపారు .
మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన ఎమ్మెల్సీ ఓటరు నమోదు సన్నాహక కార్యక్రమం మండల కాంగ్రెస్ అధ్యక్షులు శశిధర్రెడ్డిఅధ్యక్షతననిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హాజరై ప్రసంగిస్తూ, మండలంలోని ప్రతి గ్రామంలో గ్రాడ్యుయేట్లను గుర్తించి నవంబర్ 6 లోగా తప్పనిసరిగా ఓటరుగా ఆన్లైన్లో నమోదు చేయించాలని ,,హాజరైన సర్పంచులకు,,గ్రాడ్యుయేట్లకు,,పార్టీ ప్రతినిధులకు సూచించారు.మండల కాంగ్రెస్ అధ్యక్షుడు మాట్లాడుతూ గత ఎన్నికల జాబితాలో పేరు ఉన్నప్పటికీ మళ్లీ నూతనముగా ఓటు నమోదుచేయించుకోవాలని అన్నారు.సర్పంచులు బాధ్యత తీసుకొని ప్రతి గ్రాడ్యుయేట్ ను గుర్తించి ఓటర్ నమోదు ప్రక్రియలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు .
ఈ కార్యక్రమంలోయువజన కాంగ్రెస్ అధ్యక్షులు గడ్డమీద సాయి, వంగాల శేఖర్ రెడ్డి, బాధ మోని శ్రీనివాస్ గౌడ్, కలీం, వావిళ్ళ సలయ్య, పోల వెంకటేష్, అవుట మల్లేష్ ,ప్రవీణ్ రెడ్డి మాకం సైదులు, బుషిపాక బాలయ్య, కృష్ణ నాయక్ , మండలంలోని బిఎల్ఏలు, వివిధ గ్రామాల కాంగ్రెస్ పార్టీ సర్పంచులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe