అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
Participate relief efforts

(పవన్ కళ్యాణ్) అధ్యక్షులు, జనసేన

Participate Relief Efforts : త్రినేత్రం న్యూస్ : అర్నబ్ తుపాను రాష్ట్రంలోని కోస్తా జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపిస్తోంది. తుపాను తీరం దాటినా వర్షాలు భారీగా కురుస్తాయని వాతావరణ శాస్త్రవేత్తలు వెల్లడించారు. ఈ క్రమంలో తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయ చర్యలను కూటమి ప్రభుత్వం చేపట్టింది.

ఈ సహాయ చర్యల్లో జనసేన నాయకులు, వీర మహిళలు, జన సైనికులు పాలు పంచుకోవాలి. లోతట్టు ప్రాంతాలవారినీ, తీర ప్రాంతాల్లోని వారినీ సహాయక శిబిరాలకి తరలించారు. వారికి అవసరమైన సహాయం, ఆహారం, పాలు అందించాలని, అత్యవసర వైద్యం అవసరమైన వారికి తగిన విధంగా అండనివ్వాలని సూచిస్తున్నాను. అదే విధంగా రహదారులపై కూలిన చెట్లను, స్తంబాలను తొలగించడంలో నిమగ్నమైన సిబ్బందికి సహాయం చేయాలని కోరుతున్నాను…

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page