సెప్టెంబర్ 28, 2026
TRINETHRAM NEWS
MLA attends Annaprasana

MLA attends Annaprasana : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 27 ; చింతలపూడి నియోజకవర్గం ,మండలం, పట్టాయిగూడెం గ్రామానికి చెందిన పేరుబోయిన శ్రీనివాసరావు, సత్యవతి దంపతుల తనయుడు చిరంజీవి సాయి దేవాన్ష్ అన్నప్రాసన వేడుకకు డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ హాజరై చిరంజీవిని ఆశీర్వదించారు.

ఈ సందర్భంగా మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చింతం విష్ణుమూర్తి , పట్టాయిగూడెం ఆ పార్టీ ముఖ్య నాయకులు సురానేని గోపీనాథ్ , గ్రామ పార్టీ అధ్యక్షులు సురనేని సత్యంబాబు , నాయన బాబు , మాజీ సర్పంచ్ జరబల వెంకటేశ్వరరావు , తదితర నాయకులు, కార్యకర్తలు, యువత, మహిళలు, బంధుమిత్రులు పాల్గొన్నారు.

ఆయనకు ఆత్మీయ స్వాగతం ఘనంగా పలికారు. పాలతో కొద్దిసేపు ఆప్యాయంగా ముచ్చటించారు. సరదాగా సెల్ఫీలు దిగారు. అనంతరం భోజనాలు జరుగుతున్న పంక్తిలోకి వెళ్లి ప్రతి ఒక్కరినీ పేరుపేరునా పలకరిస్తూ ఆత్మీయంగా మాట్లాడారు. చిరంజీవి సాయి దేవాన్ష్ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.

Fully Automatic Electric Arti Machine Nagara – మీ పూజా గదిని గుడిలా మార్చే ఆటోమేటిక్ హారతి మిషన్!

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page