
–ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య
Bakki Venkataiah : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 25, త్రినేత్రం న్యూస్. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలంలోని కొమ్మెపల్లి గ్రామంలోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలను ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య శుక్రవారం సందర్శించారు.
ఈ సందర్భంగా ఆయన విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యతో పాటు మౌలిక వసతులు, భోజన సౌకర్యాలు, యూనిఫాం, పుస్తకాలు ఉచితంగా అందిస్తోందని తెలిపారు. విద్యార్థులు ఈ సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలకు ఎదగాలని సూచించారు. పాఠశాల సిబ్బంది కూడా విద్యార్థుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పిలుపునిచ్చారు.
అనంతరం టి పి సి సి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యేకుల రాజారావు చైర్మన్ బక్కి వెంకటయ్యను శాలువా, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో ప్రవేశపెట్టిన ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను పక్కదారి మల్లించకుండా ఆ వర్గాల అభివృద్ధి కోసం ఎస్సీ ఎస్టీ నిధులు వారికి అందే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి ఆ వర్గాలకు లబ్ధి చేరి విధంగా కృషి చేయాలని టి పి సి సి ఎస్సీ డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ యే కుల రాజారావు చైర్మన్ కి విజ్ఞప్తి చేశారు, అనంతరం ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, టీచింగ్, నాన్ టీచింగ్, సిబ్బంది టిపిసిసి ఎస్సి డిపార్ట్మెంట్ రాష్ట్ర జనరల్ సెక్రెటరీ డాక్టర్ యే కుల రాజారావుని పూల బొకే శాలువాతో ఘనంగా సన్మానించారు
కార్యక్రమంలో డి.ఎస్.పి శ్రీనివాసరావు, సీఐ వెంకటరెడ్డి ఎస్సై, గురుకుల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, స్థానిక వివిధ ప్రజాసంఘాల నాయకులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.
