సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
Girish Juyal

జమ్మూలో ముగిసిన త్రైవార్షిక ఎన్నికలు

17 రాష్ట్రాల ప్రతినిధుల హాజరు

Girish Juyal : కూకట్ పల్లి సెప్టెంబర్ 23 త్రినేత్రం న్యూస్ : హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ జాతీయ స్థాయి త్రైవార్షిక ఎన్నికలు జమ్మూలోని అగ్రవాల్ ధర్మశాలలో నిర్వహించారు. దేశవ్యాప్తంగా సుమారు 17 రాష్ట్రాలకు చెందిన ప్రతినిధులు ఎన్నికల ప్రక్రియలో పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో గిరీష్ జుయాల్ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అదేవిధంగా డాక్టర్ కరుణాకర్ ప్రధాన్ జాతీయ చైర్మన్‌గా, మధుసూదన్ గుప్తా జాతీయ చీఫ్ కమిషనర్‌గా వరుసగా రెండోసారి ఎన్నికకావడం విశేషం.

జాతీయ ఉపాధ్యక్షులుగా డాక్టర్ ఓం ప్రకాశ్ శ్రీవాస్తవ, డా.ఎం.రజనీ, దీపక్ కలితా, వనితా శర్మ, అవధేశ్ శర్మ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గం సంస్థ కార్యకలాపాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు కృషి చేయనున్నట్లు నాయకులు ప్రకటించారు. ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ కరుణాకర్ ప్రధాన్ మాట్లాడుతూ, రానున్న మూడేళ్లలో హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సంస్థ అభివృద్ధి, విస్తరణలో కీలకపాత్ర పోషిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్నికల ప్రక్రియలో దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొన్న ప్రతినిధులకు జాతీయ చీఫ్ కమిషనర్ మధుసూదన్ గుప్తా కృతజ్ఞతలు తెలిపారు.
జాతీయ స్థాయి ఎన్నికల్లో తెలంగాణకు చెందిన ప్రతినిధులు పాల్గొని తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలంగాణ ప్రతినిధులు ఎం.మహేందర్ నాయక్ – తెలంగాణ నోడల్ ఆఫీసర్
పి.నాగరాజు – ప్రతినిధి
స్వాతి – ప్రతినిధి
దివ్య ఆర్చన – ప్రతినిధి
తెలంగాణ ప్రతినిధులు జమ్మూలో నిర్వహించిన జాతీయ ఎన్నికల ప్రక్రియలో పాల్గొని సంస్థ నూతన కార్యవర్గం ఎన్నికలో తమ ఓటు హక్కును వినియోగించారు. రాష్ట్రంలో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాల విస్తరణతోపాటు జాతీయ స్థాయిలో సంస్థను మరింత బలోపేతం చేసేందుకు తమవంతు సహకారం అందించనున్నట్లు తెలిపారు.దేశవ్యాప్తంగా విస్తరణకు ప్రాధాన్యం
నూతనంగా ఎన్నికైన కార్యవర్గం హిందుస్థాన్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా మరింత విస్తరించేందుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలిపింది.పట్టణాలతోపాటు గ్రామీణ ప్రాంతాలు, విద్యాసంస్థల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించడంతోపాటు యువతను సేవా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేయడంపై దృష్టి సారించనున్నట్లు వెల్లడించింది.యువతలో సేవాభావం, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలను పెంపొందించడం, సంస్థ కార్యకలాపాలను మరింత బలోపేతం చేయడం నూతన కార్యవర్గం ముందున్న ప్రధాన లక్ష్యాలుగా వారు పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page