Trinethram News : రాష్ట్రంలోని 10 పూర్వ జిల్లాల అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మొత్తం జిల్లాలకు కలుపుకుని రూ.
1190 కోట్లు కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. నియోజకవర్గ అభివృద్ది కోసం రూ. 10 కోట్లలో రూ. 2 కోట్లు విద్యాభివృద్ధి కోసం, రూ. కోటి తాగునీటి సౌకర్యం కోసం, నియోజకవర్గానికి రూ. 50 లక్షల చొప్పున మండల పరిధిలోని ప్రభుత్వ కార్యాలయాలు, జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సముదాయాల కార్యాలయాల మెయింటెనెన్స్ కోసం వెచ్చించాలని పేర్కొంది. జిల్లాల ఇన్ ఛార్జి మంత్రుల ఆమోదంతోనే ఈ నిధులు ఖర్చు చేయాల్సి ఉంది. కరీంనగర్ జిల్లా రూ. 130 కోట్లు కేటాయించగా అందులో రూ. 26 కోట్లు ప్రాథమిక విద్యా సదుపాయాలు, రూ. 13 కోట్లు తాగునీటి సౌకర్యం, రూ. 6.50 లక్షలు ప్రభుత్వ కార్యాలయాలకు కేటాయించారు. మహబూబ్ నగర్ రూ. 140 కోట్లు, ఖమ్మం రూ. 100, రంగారెడ్డి రూ. 140, వరంగల్ రూ.120, హైదరాబాద్ రూ. 15 మెదక్ రూ. 100 కోట్లు, ఆదిలాబాద్ 100 కోట్లు, నల్గొండ రూ. 120 కోట్లు, నిజామాబాద్ రూ. 90 కోట్లు కేటాయిస్తూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది.
ప్రతి నియోజకవర్గానికి రూ.10కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
Related Posts
TWJF appeal to CM Revanth : జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి : -సీఎం రేవంత్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
TRINETHRAM NEWS జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలు వెంటనే ఇవ్వాలి-సీఎం రేవంత్ కు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలుతొలి టర్మ్ లొనే కేటాయించాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) రాష్ట్ర కమిటీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం…
మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
TRINETHRAM NEWS మత్స్యకారుల అభివృద్ధిపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధవహించాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ … Trinethram News : Medchal : ఈరోజు 125 – గాజుల రామారం డివిజన్ చింతల చెరువు వద్ద నిర్వహించిన చేప పిల్లల విడుదల కార్యక్రమానికి…