
PADA : కాకినాడ జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08; రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పిఠాపురం నియోజవర్గానికి మరో గుర్తింపు లభించింది. ఆ ప్రాంత అభివృద్ధికి అథారిటీ (పాడా )ను ప్రణాళిక శాఖ పరిధిలోని స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థగా ప్రభుత్వం ప్రకటించింది.
అయితే ప్రత్యేక స్వయం ప్రతిపత్తి సంస్థగా జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వ్యవహారిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పిఠాపురం నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దడం, సమగ్ర ఆర్థిక అభివృద్ధిని వేగవంతం చేయడం, అదేవిధంగా పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడమే కర్తవ్యం.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe