
Safe Drinking Water : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 08; ఉంగుటూరు నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు పత్సమట్ల ధర్మరాజు క్యాంపు కార్యాలయంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఎస్ఈ, ఈఈ, డీఈ, ఏఈలతో పాటు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి గ్రామంలో నెలకొన్న త్రాగునీటి సమస్యలపై అధికారులతో సమగ్రంగా చర్చించారు.
ఆయా గ్రామాలకు చెందిన ప్రజాప్రతినిధులు, స్థానిక నాయకులతో సమన్వయం చేసుకుంటూ గ్రామాల వారీగా త్రాగునీటి సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశిం చారు. ప్రజలకు త్రాగునీటి సరపరాలలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని గ్రామాల్లో నిరంతరాయంగా త్రాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ముఖ్యంగా సమస్యలు తలెత్తే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి, అవసరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు స్పష్టం చేశారు.
నియోజకవర్గంలో ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో ప్రస్తుతం జరుగుతున్న వివిధ పనుల పురోగతిని సభ్యులు ధర్మరాజు అధికారులను అడిగి తెలుసుకున్నా రు. కొనసాగుతున్న పనుల్లో జాప్యం లేకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని వెల్లడించారు. వర్షపాతం పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని భవిష్యత్తులో నియోజకవర్గంలో త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా ఒక సంవత్సరం ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని తెలిపారు.
అవసరమైన త్రాగునీటి పథకాలు, మౌలిక సదుపాయాలు మరియు చేపట్టాల్సిన పనులకు సంబంధించి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను కోరారు. ప్రజలకు ఎటువంటి త్రాగునీటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ముందస్తు కార్యాచరణ ప్రణాళికతో పనిచేయాలని, ప్రజాప్రతినిధులు మరియు స్థానిక నాయకులతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజ స్పష్టం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe