సెప్టెంబర్ 3, 2026
TRINETHRAM NEWS
Pawan Kalyan Birthday Celebrations

Pawan Kalyan Birthday Celebrations : అనంతగిరి సెప్టెంబర్ 3, (త్రినేత్రం న్యూస్): ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ 55వ జన్మదిన వేడుకలను అల్లూరి సీతారామరాజు జిల్లా ,అనంతగిరి మండల కేంద్రంలో జనసేన శ్రేణులు ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షులు చిట్టం మురళి ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజా సేవలో ఆయన మరిన్ని విజయాలు సాధించాలని నాయకులు ఆకాంక్షించారు.
కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు కొర్ర ప్రవీణ్ కుమార్, కార్యదర్శి పాంగి లక్ష్మణ్, నాయకులు సాగర మధు, డి.చంటి, పంచాయతీ అధ్యక్షులు మజ్జి గడ్డయ్య, కర్రీ శేషు తదితరులు, జనసైనికులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిట్టం మురళి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు ప్రతి జనసైనికుడు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page