
MLA Inaugurates Belstar : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 31; జీలుగుమిల్లి మండలం, ప్రధాన కూడలిలోని యాండ్ర వారి కాంప్లెక్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బెల్‌స్టార్ గోల్డ్ లోన్ బ్యాంకు ను పోలవరం నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు రిబ్బన్ కట్ చేసి ఘనంగా ప్రారంభించారు. బ్యాంకు ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేసిన ఆయన కు బ్యాంకు సిబ్బంది, కూటమి నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి బ్యాంకు సేవలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిర్రి బాలరాజు మాట్లాడుతూ, జీలుగుమిల్లి ప్రాంత ప్రజలకు ఆర్థిక సేవలు మరింత చేరువ కావడం అభినందనీయమన్నారు. స్థానిక ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని గోల్డ్ లోన్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం ద్వారా బ్యాంకు ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, నమ్మకమైన సేవలు అందిస్తూ బెల్‌స్టార్ గోల్డ్ లోన్ బ్యాంక్ మంచి పేరు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు. వ్యాపారులు, రైతులు, చిరు ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలకు అవసరమైన సమయంలో ఆర్థిక సహకారం అందించడంలో ఇటువంటి సంస్థలు కీలక పాత్ర పోషిస్తాయని పేర్కొన్నారు.
ఆ ప్రాంతంలో మరిన్ని వ్యాపార, వాణిజ్య సంస్థలు ఏర్పడి స్థానికంగా ఉపాధి, ఆర్థిక అవకాశాలు పెరగాలని కోరుకుంటున్నట్లు సంతోషం వ్యక్తం చేశారు . ప్రజల సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి తోడ్పడే ప్రతి కార్యక్రమానికి తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బెల్‌స్టార్ గోల్డ్ లోన్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ తాణికొండ రాము, సీబీఎం దొడ్డ సాయి కిరణ్, మేనేజర్ ముదిగొండ సుదర్శన్, సిబ్బంది అనూష, వంశీ, అజయ్, లక్ష్మణ్, భార్గవ్, కూటమి నాయకులు రూపా సత్యనారాయణ, చిర్రి నాగరాజు, కుంజా రమేష్, ధనుంజయ్, నాలి శ్రీనివాస్, యాండ్ర శేఖర్, మద్దాల రమేష్, గద్దే సుబ్రహ్మణ్యం, కక్కిరాల శ్రీనివాస్, కూరాకుల రవి తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe