ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Horticulture Assistant Director

Horticulture Assistant Director : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 27 ; చింతలపూడి నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ జిల్లాలో హర్టికల్చర్ పంటలు అధికంగా సాగు చేయబడుతున్న నియోజకవర్గం అని గుర్తు చేశారు. హార్టికల్చర్ సహాయ సంచాలకులు కార్యాలయం ఏర్పాటు చేసి రైతులకు నాణ్యమైన సేవలు అందించడం ద్వారా మరింత అధిక దిగుబడులు సాధించడానికి అవకాశం కలుగుతుందని ఆ శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్ ను సచివాలయంలో కలసి వివరించారు.

అదేవిధంగా కో కో వాపంటలో దేశంలోని తొలి స్థానం చింతలపూడి అని పేర్కొన్నారు. ఆ పంటలను ప్రోత్సహించడానికి మరిన్ని నూతన వంగడాలు ప్రవేశపెట్టి అధిక దిగుబడులు సాధించడానికి ఎంతో దోహదపడగలదని ఆయన వెల్లడించారు. అందుకు అవసరమైన చర్యలు చేపడతామని వ్యవసాయ శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page