ఆగస్ట్ 29, 2026
TRINETHRAM NEWS
Raksha Bandhan Celebrations

–ప్రధానోపాధ్యాయురాలు. భారతి.

Raksha Bandhan Celebrations : డిండి( గుండ్లపల్లి) ఆగస్టు 27,త్రినేత్రం న్యూస్. డిండి మండల కేంద్రంలోని ఆల్ఫా మోడల్ స్కూల్ లో ముందస్తు రక్షాబంధన్ వేడుకలను ప్రధానోపాధ్యాయురాలు భారతి ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ రక్షాబంధన్ గొప్పతనాన్ని, అన్నా చెల్లెలు అనుబంధాన్ని గొప్పగా వివరిస్తూ విద్యార్థులకు తెలియజేశారు.
ఈ సందర్భంగా పాఠశాలలో చదువుతున్న తెడ్లపల్లి అస్మిత్ వెంకట్రావు వారి తల్లిదండ్రులు సంపత్ రావు, స్వర్ణ తన కుమారుని జన్మదిన సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పాఠశాల లో కేకు కట్ చేసి, పండ్లను పంపిణీ చేసి ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ బృందం ప్రకాష్, సినీ, లింగమయ్య,భార్గవి, మహర్జన, సంధ్య, లక్ష్మి సంధ్య మరియు తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page