
డిండి మండలంలో మొ రం, మట్టి తవ్వకాలు.
ఎక్కడపడితే అక్కడ తవ్వకాలు.
అక్రమంగా సరఫరా చేస్తూ అందిన కాడికి దోచుకుంటున్న వైనం.
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలన్న ప్రజలు.
Illegal Excavation : డిండి (గుండ్లపల్లి) ఆగష్టు 23, త్రినేత్రం న్యూస్. డిండి మండలంలో అక్రమ మట్టి, మొరం తవ్వకాలు ఆగడం లేదు . ఎక్కడపడితే అక్కడే తవ్వకాలు చేస్తున్నారు, మొరాన్ని , మట్టిని తరలిస్తున్నారు. కావాల్సినవారికిఅమ్మకాలు జరిపి అందినకాడికి , దండుకుంటున్నారు.
ప్రభుత్వ పథకాలకు అను మతులు ఇస్తుండటంతో దానిని ఆధారంగా చేసుకొని అక్రమంగా తరలిస్తున్నారు. అధికారులు లేని సమయంలో గుట్టుగా రవాణా చేస్తున్నారు. ఫిర్యాదులు వచ్చిన సమయంలో అధికారులు ట్రాక్టర్లను సీజ్ చేస్తున్నా… మిగతా సమయాలలో జోరుగా రవాణా చేస్తున్నారు. మొరం , మట్టి దందా ఎక్కువగా కొనసాగుతోంది. అభివృద్ధి పథకాలతో పాటు, ఇండ్లు, రోడ్ల నిర్మాణాలు అవుతుండటంతో వాటిని ఆసరాగా చేసుకుని అక్రమంగా రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారనీ మండల ప్రజలు వాపోతున్నారు.
—– వివరాలలోకి వెళితే ,
ఆదివార రోజు డిండి మండల పరిధిలోని వావిల్ కోల్ గ్రామం నుండి అక్రమంగా ఎల్లారెడ్డి బాయి కి కొందరు కలిసి ఎలాంటి అనుమతులు లేకుండా , అక్రమంగా మూడు ట్రాక్టర్ల ద్వారా జెసిబి సహాయం తో మోరాన్నీతవ్వి , తరలిస్తున్నారని , వారి పై చర్యలు తీసుకోవాలని ప్రజలు అధికారులను కోరారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe