ఆగస్ట్ 19, 2026
TRINETHRAM NEWS
Former MLA

Former MLA : నెరడుగొమ్ము ఆగష్టు 18, త్రినేత్రం న్యూస్. నేరడుగొమ్ము మండలం చిన్నమునిగల్ గ్రామానికి చెందిన కేతావత్ మహేష్ రోడ్డు ప్రమాదంలో గాయపడి దేవరకొండ పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.మంగళవారం దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన దేవరకొండ మాజీ శాసనసభ్యులు రమావత్ రవీంద్ర కుమార్ కేతావత్ మహేష్‌ను పరామర్శించారు.

ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.ఈ సందర్భంగా కేతావత్ మహేష్ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి, త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఆయన వెంట కేతావత్ నాగు, వడత్య బాలు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page