సెప్టెంబర్ 4, 2026
TRINETHRAM NEWS
Minister Kandula Durgesh

Minister Kandula Durgesh : తూర్పుగోదావరి జిల్లా : త్రినేత్రం న్యూస్ : ఆగస్టు 11 ; రాష్ట్ర ప్రభుత్వం రాబోయే 2027 వ సంవత్సరంలో నిర్వహించినటువంటి గోదావరి మహా పుష్కరాల కోసం అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు కింద రూపాయలు 210 కోట్లను మంజూరు చేసిందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

ఈ నిధులతో పాత, కొత్త పుష్కర ఘాట్ల అభివృద్ధి పనులను చేపడతారని సూచించారు. ప్రయాగ్ రాజ్ లో జరిగినటువంటి మహా కుంభమేళా తరహాలో గోదావరి పుష్కరాలను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. అయితే ఉభయగోదావరి జిల్లాల పరిధిలోని ఆ పుష్కర ఘాట్లను ఆధునికరించి, నది తీరాలను సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు ప్రకటించారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page