
MLA Hands Over LOC : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 25 ; చింతలపూడి నియోజకవర్గం, మండలం, చింతపల్లి గ్రామానికి చెందిన మండా మణికంఠ స్వామి (తండ్రి సత్యనారాయణ) బైపాస్ సర్జరీ నిర్వహించేందుకు అవసరమైన రూ. 7,29,800 విలువైన *ఎల్‌ఓసి (లెటర్ ఆప్ క్రెడిట్) ను ఆ నియోజకవర్గం డైనమిక్ శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ అందజేశారు.
ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ధైర్యం చెబుతూ, ప్రభుత్వం ప్రజల ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా అండగా నిలుస్తామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో చింతలపూడి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షులు చింతం విష్ణుమూర్తి మరియు మండల జనరల్ సెక్రటరీ రావు కిరణ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe