
–దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ .
MLA Balu Naik : చింతపల్లి జులై 25,త్రినేత్రం న్యూస్ : దేవరకొండ నియోజకవర్గంలోని చింతపల్లి మండలం తీదేడు, మల్లారెడ్డిపల్లి, తక్కళ్లపల్లి, వింజమూరు గ్రామాల్లో దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలు నాయక్ పర్యటించి SIR (ఓటరు జాబితా ప్రత్యేక సవరణ) ప్రక్రియపై అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలు నాయక్ ఎంఆర్వో, బీఎల్ఓలు, బీఎల్ఏలు, కాంగ్రెస్ పార్టీ నాయకులతో సమావేశమై, ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు ఓటరు జాబితాలో ఉండేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. SIR ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేసి, ఒక్క అర్హుడి ఓటు కూడా తొలగిపోకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఓటు ప్రజాస్వామ్యంలో అత్యంత విలువైన హక్కు అని, ప్రతి అర్హత కలిగిన పౌరుడు తన ఓటు నమోదు, వివరాల సవరణ వంటి ప్రక్రియలను నిర్లక్ష్యం చేయకుండా పూర్తి చేసుకోవాలని ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు హక్కు ప్రాముఖ్యతను ప్రతి ఇంటికి చేరవేసి, ప్రజలు తమ వివరాలను సకాలంలో ధృవీకరించుకునేలా కృషి చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఎల్ఎలు, కార్యకర్తలు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe