జూలై 26, 2026
TRINETHRAM NEWS
Deesari Gangaraju

Deesari Gangaraju : అనంతగిరి, జూలై 26, (త్రినేత్రంన్యూస్): ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనాలతో పాటు మినిమమ్ టైమ్ స్కేల్ అమలు చేసి, దీర్ఘకాలంగా పనిచేస్తున్న వారిని పర్మినెంట్ చేయాలని సీపీఎం జడ్పీటీసీ సభ్యులు దీసరి గంగరాజు డిమాండ్ చేశారు. అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి హరిత రిసార్ట్స్‌లో సీఐటీయూ మండల కన్వీనర్ కిల్లో మోస్య ఆధ్వర్యంలో శనివారం నాడు నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ నెల 30న పాడేరులో జరిగే కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ కార్మికుల ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో టూరిజం యూనియన్ నాయకులు దీసరి బుద్దురాజు, దండుసేన సన్యాసమ్మ, దాసు చెట్టి లలిత, రామారావు తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page