జూలై 25, 2026
TRINETHRAM NEWS
Parents-Teachers Cordial Meeting 4.0'

Parents-Teachers Cordial Meeting : గంగాధర్ నెల్లూరు నియోజకవర్గo ( త్రినేత్రం న్యూస్ ) జూలై 24. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తల్లిదండ్రులు ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశ4.0 కార్యక్రమం గంగాధర నెల్లూరు నియోజకవర్గo పెనుమూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఘనంగా నిర్వహించారు. పెనుమూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్. శారదా ఆధ్వర్యంలో జరిగింది. ముందుగా కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రుల పాదాలు కడిగి నమస్కరించారు. తరువాత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు రుద్రయ్య నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యార్థులకు తల్లికి వందనం కార్యక్రమంలో ఒక ఇంట్లో ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి13000 చొప్పున వారి బ్యాంకు ఖాతాలో జమ చేశారు.

అలాగే పెనుమూరు ఎస్ ఐ శ్రీనివాసులు మాట్లాడుతూ పిల్లలు క్రమశిక్షణతో పెరిగి తమకంటూ ఓ గుర్తింపు తెచ్చుకోవాలన్నారు. చెడు అలవాట్లకు దూరంగా, ఆడపిల్లల జోలికి వెళ్లకుండా ఇంటర్మీడియట్ రెండు సంవత్సరాలు బుద్ధిగా చదువుకొని అటు తల్లిదండ్రులకు ఇటు కళాశాలకు మంచి పేరు తేవాలన్నారు.

ఈ కార్యక్రమంలో పట్నం పరమేశ్వర్ రెడ్డి, ఎంఈఓ భాస్కర్ నాయుడు, ఎంపీడీవో టి ఆర్ ఢిల్లీ బాబు, ఎమ్మార్వో మరియు కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పాఠశాల ప్రధానోపాధ్యాయుల రమేష్ బాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తల్లిదండ్రులకు వినోదం కలిగించుటకు మగవారికి టగ్ ఆఫ్ వార్, ఆడవారికి మ్యూజికల్ చైర్స్ ఆడించారు. తరువాత తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్కూల్ చైర్పర్సన్, రాజకీయ నాయకులు అందరూ కలసి సహా పంక్తి భోజనం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page