
Tree Collapses : అరకులోయ,జూలై 25, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా డుంబ్రిగూడ మండలం అరకు వారపు సంతలో శుక్రవారం భారీ వృక్షం నేలకూలి నాలుగు ఆటోలు ధ్వంసమైన ఘటన కలకలం రేపింది. వివరాల్లోకి వెళితే.. బొందుగూడ వెళ్లే రహదారిపై ఉన్న భారీ వృక్షం ఒక్కసారిగా నేలకూలింది. అదే ప్రాంతంలో ప్రతి వారం బొందుగూడ, కొరాయి గ్రామాలకు తిరిగే ఆటోలను నిలిపే స్థలం ఉండడంతో చెట్టు నేరుగా ఆటోలపై పడింది. దీంతో నాలుగు ఆటోలు పూర్తిగా ధ్వంసమయ్యాయి.
ఘటన జరిగిన సమయంలో అక్కడ పలువురు ప్రజలు, ఆటో డ్రైవర్లు ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆటోలకు భారీ నష్టం వాటిల్లినట్లు సమాచారం. వారపు సంతకు వచ్చిన ప్రజలు ఈ ఘటనతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉన్న పాత, భారీ వృక్షాలను గుర్తించి తొలగించాలని స్థానికులు సంబంధిత అధికారులను మరియు పంచాయతీ వారికి కోరుతున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe