
Araku MLA : అరకులోయ, జూలై 23, (త్రినేత్రంన్యూస్): అల్లూరి సీతారామరాజు జిల్లా అరకువ్యాలీ ఏరియా ఆసుపత్రిలో గత నెల రోజుల్లో 135 మలేరియా, టైఫాయిడ్ కేసులు నమోదుకావడం ఆందోళనకరమని అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం అన్నారు. బుధవారం నాడు అరకువ్యాలీ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన వైద్య సేవలు, మందుల లభ్యత, రోగులకు అందుతున్న సౌకర్యాలను పరిశీలించారు.
సీజనల్ వ్యాధుల నియంత్రణకు వెంటనే ఇంటింటి సీజన్ వ్యాధుల సర్వే నిర్వహించాలని, మలేరియా-టైఫాయిడ్ నిర్ధారణ కిట్లు, మందులు అందుబాటులో ఉంచాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో ఫాగింగ్, యాంటీ లార్వా స్ప్రేయింగ్, పారిశుద్ధ్య చర్యలు ముమ్మరం చేయాలని సూచించారు.
జ్వరం లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని, నీటిని కాచి తాగడం, దోమతెరలు వినియోగించడం వంటి జాగ్రత్తలు పాటించాలని ప్రజలకు ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe