WhatsApp Image 2024 02 01 at 2.21.48 PM
Trinethram News : లక్నో :ఫిబ్రవరి 01
రాములోరిని దర్శించుకునేందుకు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలి వస్తున్నారు.
ఈ కోవలో ముస్లీంలు కూడా రాముని దర్శనం కోసం వస్తున్నారు. తాజాగా లక్నో నుంచి 350మంది ముస్లీంలు రాముని దర్శనం కోసం ఈరోజు అయోధ్యకు చేరుకున్నారు..
భగవాన్ శ్రీ రాముడు పూర్వీకుడు అని.. కులం, మతం కన్నా దేశం కోసం ప్రేమ, మానవత్వం ఎక్కువ. ఏ మతం ఇతరులను విమర్శించడం, ఎగతాళి చేయడం లేదంటే అసహ్యించుకోవాలి అని’ బోధించదని ఎంఆర్ఎం కన్వీనర్ రాజా రయీస్ తెలిపారు.
రాష్ట్రీయ్ స్వయం సేవక్ మద్దతు గల ముస్లిం రాష్ట్రీయ మంచ్ నేతృత్వంలోని బృందం బయల్దేరింది.ముస్లిల బృందం లక్నో నుంచి కాలినడకన అయోధ్య చేరుకుంది.
చలిలో 150 కిలోమీటర్లు కాలి నడకన వచ్చి తమ భక్తిని చాటుకుంది. ‘ప్రతి 25 కిలోమీటర్లు నడిచిన తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకున్నాం. రాత్రి పడుకొని, మరునాడు బయలుదేరాం.
ఆరు రోజుల తర్వాత అయోధ్య చేరుకున్నాం. బాల రాముడిని దర్శించు కొని తరించాం. రాములోరి దర్శనం హిందు- ముస్లింల ఐక్యతను పెంచి, దేశ సమ గ్రతను కాపాడుతుంది….
