జూలై 14, 2026
TRINETHRAM NEWS
MLA Songa Roshan

MLA Songa Roshan : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూలై 09; చింతలపూడి నియోజకవర్గం, జంగారెడ్డిగూడెం మండలం, గురవాయిగూడెం గ్రామంలో ఉన్నటువంటి మద్ది ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రంలో రూ. ఒకటి. రెండు సున్న కోట్ల నిధులతో నిర్మించిన “శ్రీరామ సదన్” భవన సముదాయాన్ని చింతలపూడి శాసనసభ్యులు సొంగా రోషన్ కుమార్ ఘనంగా భక్తుల సౌకర్యార్థం లాంఛనంగా ప్రారంభించారు.

భక్తులకు మెరుగైన వసతి కల్పించే ఉద్దేశంతో ఎనిమిది గదులతో నిర్మించిన ఈ శ్రీరామ సదన్‌ను ప్రారంభించిన అనంతరం ఆలయ అభివృద్ధికి విశేష సహకారం అందించిన దాతలకు శాసనసభ్యులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. వాళ్ల సేవాభావాన్ని కొనియాడుతూ శాలువాతో సత్కరించి ఘనంగా సన్మానించారు.

ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని శాసనసభ్యులు పేర్కొన్నారు. ఈ భవనం ద్వారా ఆలయానికి విచ్చేసే భక్తులకు మరింత మెరుగైన వసతి సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి అని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆలయ ఈఓ శ్రీమతి చందన , కమిటీ చైర్మన్, సభ్యులు, కూటమి నాయకులు, కార్యకర్తలు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page