
Boy Saves Six Lives : త్రినేత్రం న్యూస్ : Jul 07, 2026, రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన 7 ఏళ్ల బాలుడి కుటుంబం తీసుకున్న నిర్ణయం ఆరుగురికి ప్రాణం పోసింది. హైదరాబాద్ లోని తిరుమలగిరి యాదమ్మ నగర్‌కు చెందిన లోకినేని రఘు, సౌమ్య పాపారావు కుటుంబం ఉద్యోగరిత్యా తమిళనాడులో ఉంటోంది.
అయితే వీరి కుమారుడు యాశ్వన్(7) జూన్ 29న సైకిల్‌పై రోడ్డు దాటుతుండగా అంబులెన్స్ అతడిని ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న బాలుడికి జులై 5న బ్రెయిన్ డెడ్ అయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న ఆ కుటుంబం అవయవదానానికి ముందుకు వచ్చింది. యాశ్వన్ రెండు కిడ్నీలు, కాలేయం, రెండు కార్నియాలు, గుండె కవాటంతో సహా మొత్తం ఆరు అవయవాలను దానం చేశారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe