జూలై 5, 2026
TRINETHRAM NEWS
Distribution SIR Forms

Distribution SIR Forms : త్రినేత్రం న్యూస్, అశ్వారావుపేట మండలం. పేరాయిగూడెం లో ముమ్మరంగా ఓటర్ల నమోదు/సవరణ ప్రక్రియ,పాల్గొన్న బి. ఎల్. వో.లు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…..
అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలోని పేరాయిగూడెం (బూత్ నెంబర్ 164) లో తుమ్మల యువ నాయకుడు ఎన్. రాజశేఖర్ ఆధ్వర్యంలో ‘సార్’ (SIR) ఫారాల పంపిణీ కార్యక్రమం అత్యంత చురుగ్గా సాగింది.పేరాయిగూడెం గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్ నార్లపాటి సత్యవతి తనయుడైన ఎన్. రాజశేఖర్ స్వయంగా ముందడుగు వేసి ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.
గ్రామంలోని అర్హులైన వారందరికీ ఓటరు సేవలు అందాలనే లక్ష్యంతో, యువతను మరియు ప్రజలను సమాయత్తం చేస్తూ ఆయన ఈ పంపిణీని నిర్వహించారు.ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమైనదని, ప్రతి ఒక్కరూ తమ ఓటును నమోదు చేసుకోవడంతో పాటు అవసరమైన సవరణలు చేసుకోవడానికి ఈ ఫారాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బి.ఎల్.ఓ.లు (BLO) కొత్తపల్లి మరియమ్మ, బొబ్బరి తిరపతమ్మ తదితరులతో కలిసి యువనేత రాజశేఖర్ ఫారాలను పంపిణీ చేస్తూ ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. స్థానిక నాయకులు, తుమ్మల అభిమానులు మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page