జూన్ 26, 2026
TRINETHRAM NEWS
Steel Water Bottles Distributed

Steel Water Bottles Distributed : ఎన్టీఆర్ జిల్లా : త్రినేత్రం న్యూస్ : జూన్ 24; ఏ కొండూరు మండలం, వల్లంపట్ల గ్రామం ప్రాథమిక పాఠశాల లో గ్రామ అభివృద్ధి ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో రిటైర్డ్ ఇంజనీర్ కుటుంబ నాగేశ్వరరావు తన స్వగ్రామ పాఠశాల విద్యార్థులకు ముప్పై రెండు స్టీల్ వాటర్ బాటిల్స్ ను మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) కేశవరావు చేతుల మీదుగా విద్యార్థులకు అందజేశారు.

ఈ సందర్భంగా ఎంఈఓ కేశవరావు మాట్లాడుతూ ప్రతిరోజు తగినంత నీరు తాగటం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని ఈ వాటర్ బాటిల్స్ వినియోగం పర్యావరణ పరిరక్షణకు కూడా దోహదపడుతుందని వివరించారు. విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకొని ఉన్నత లక్ష్యాలను సాధించి భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకోవాలని తమ గ్రామానికి పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.

పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు భూక్య సుబ్రహ్మణ్యం, శ్రీకాకుళపు శామ్యూల్ విద్యార్థులు కుటుంబ నాగేశ్వరావు సేవా భావాన్ని అభినందిస్తూ కృతజ్ఞతలు తెలిపారు. స్వగ్రామ అభివృద్ధి కోసం ముందుకు వచ్చి విద్యార్థులకు ఉపయోగపడే వస్తువులను అందించడం ఆదర్శప్రాయమని కొనియాడారు .ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఆనందాన్ని నింపటంతో పాటు సేవాభావానికి ఆదర్శంగా నిలిచింది.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page