TRINETHRAM NEWS

30,000/- financial assistance for better medical treatment

యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ వారి ఆధ్వర్యంలో లివర్ సమస్యతో బాధపడుతున్న పుప్పాల నవ్య కు మెరుగైన వైద్యం కోసం 30,000/- రూపాయల ఆర్థిక సహాయం.

వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

యువ నేతాజీ ఫౌండేషన్, వరంగల్ వారి ఆధ్వర్యంలో స్తంబంపల్లి గ్రామం , ఖిలా వరంగల్ మండలం , వరంగల్ జిల్లా కు చెందిన ” పుప్పాల నవ్య ” లివర్ సమస్యతో బాధపడుతు కిమ్స్ హాస్పిటల్ హైదరాబాద్ నందు చికిత్స పొందుతుంది.

పుప్పాల నవ్య కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగుగాలేనందున , ఈ కష్టకాలంలో వారి కుటుంబానికి ఆర్థికంగా సహాయం చేయాలని యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్ , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , బొట్టు కమలాకర్ , మనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ల రాజేంద్ర ప్రసాద్ తన వాట్సప్ సోషల్ మీడియా ద్వారా వీరి కుటుంబానికి సహాయం చేయవలసిందిగా కోరడంతో దాతలందరి సహకారంతో ముఖ్యంగా రక్తదాతలు , యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ సభ్యులు , వరంగల్ పోలీస్ శాఖ వారి సహకారంతో సేకరించిన మొత్తం అమౌంట్ 30,000/- రూపాయలు పుప్పాల నవ్య కు మెరుగైన వైద్యం కోసం వారి తల్లిదండ్రులకు అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆర్థికంగా సహాయం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.
ఈ కార్యక్రమంలో యువ నేతాజీ ఫౌండేషన్ వరంగల్ అధ్యక్షులు కొత్తకొండ అరుణ్ కుమార్ , మనం స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు గోళ్ల రాజేంద్ర ప్రసాద్ , పొన్నగంటి నాగరాజు , వరంగల్ పోలీస్ కానిస్టేబుల్ కన్నె రాజు ( స్విమ్మర్ రాజు ) , కానిస్టేబుల్ బొట్టు కమలాకర్ , కోలా రాజేష్ , ఉప్పరపల్లి రాజ్ కుమార్ , రామకృష్ణ , బొట్టు వినయ్ , బొట్టు చింటు , సుభాష్ , కన్నె నరేష్ – మహేశ్వరి , రాము , మహేష్ , నగేష్ , చిరంజీవి , భాస్కర్ , ఆంజనేయులు , రాజు , సూర్య ప్రకాష్ , మనీష్ జైన్ , శ్రీనివాస్ , వీరేందర్ , ప్రదీప్ కుమార్ , వీరన్న , శ్రీకర్ , మానస , అశోక్ , అనిల్ , రఘు , కుమార్ , ఉస్మాన్ , రాజేష్ , వినోద్ కుమార్ , నాగరాజు , అబ్దుల్ వహీద్ , రవీందర్ , సంతోష్ , మనోరంజన్ , కేతన్ , సాయి విశాల్ , వెంకటరమణ , సోమేష్ పాల్గొనడం జరిగింది

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

30,000/- financial assistance for better medical treatment.