1917,1959,1970 భూ బదలాయింపు నిషేధ చట్టాలను అనుసరించాలి: ఆదివాసి జెఎసి.
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, అల్లూరిజిల్లా ఇంచార్జ్ : 1917,1959,1970 భూ బదాలాయింపు నిషేధ చట్టాలను అనుసరించాలి: ఆదివాసీ జెఎసి,
ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో గల భూ బదలాయింపు నిషేధ చట్టాలు 1917,1959,1970 లను అనుసరించాలని ఆంధ్ర ప్రదేశ్ ఆదివాసి జెఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మొట్టడం రాజబాబు,జిల్లా కన్వీనర్ రామారావు దొర కలెక్టర్ని కోరారు.భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వం ఉన్నప్పుడే 1917లో షెడ్యూల్ ప్రాంతంలో భూ బదులయింపు నిషేధ చట్టం తీసుకొని వచ్చిందని, ఈ చట్టం ప్రకారం కలెక్టర్ (ఏజెంట్ టు ది గవర్నమెంట్)అనుమతితో ఆదివాసేతరులు ఆదివాసీల దగ్గర నుండి భూమి కొనుగోలు చేయడానికి తగు కారణాలు చూపిస్తే కొనుగోలు చేసుకోవచ్చన్నారు.భారత స్వతంత్రం అనంతరం ఆ చట్టాన్ని 1959లో రద్దుచేసి, కొత్తగా భూబధాలయింపు నిషేధ చట్టం (1/59 చట్టం) చేసారని,ఆ చట్టం ప్రకారం అప్పటివరకు ఆదివాసేతరులు భూమి కొనుగోలుకు ఉన్న కలెక్టర్ అనుమతి కూడా రద్దు అయిందన్నారు.ఆదివాసీల భూమి అన్యక్రాంతం అవుతుండగా, పెద్ద ఎత్తున ఆదివాసీల పోరాటాలు చేస్తుండగా ప్రభుత్వం 1970 లో భూబదాలయింపు నిషేధ చట్టం (1/70 చట్టం) చేసారన్నారు.
ఈ చట్టం ప్రకారం ఐదో షెడ్యూల్ ప్రాంతంలో ఆదివాసీలకు, ఆదివాసీలకు మధ్యన మాత్రమే భూబదాలయింపు ఉండాలి తప్ప,ఆదివాసులకు, ఆదివాసేతరులకు మధ్య ఎటువంటి భూబదాలయింపు ఉండకూడదని,ఆదివాసి అమ్మాయి ఆదివాసేతరులకు పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయికి, తల్లిదండ్రుల నుండి స్థిరాస్తులుగా బహుమానంగా ఇవ్వడానికి కూడా వీలు లేదన్నారు.అలాగే ఈ భూబదాలయింపు నిషేధ చట్టాలు ప్రకారం గిరిజనేతలకు ఐదో షెడ్యూల్డ్ ప్రాంతంలో భూమి మీద ఎటువంటి చట్టాలు హక్కులు లేవన్నారు. ఆదివాసి ప్రజానీకానికి చట్టాల మీద అవగాహన లేకపోవడంతో పాటు అధికారుల నిర్లక్ష్యం వల్ల, ఐదవ షెడ్యూల్ ప్రాంతంలో భూమి ఆదివాసేతరుల చేతుల్లోకి వెళ్ళింది. కొయ్యూరు మండలం పూర్తిగా ఐదవ షెడ్యూల్డ్ ప్రాంతం.ఈ మండలానికి ఆనకొని నాన్ షెడ్యూల్డ్ ప్రాంతం ఉంది.ఏ కారణం చేతనో ఆదివాసేతరులకు( నాన్ ట్రైబల్స్) ఈ షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములున్నాయి.ఆ భూములు తాతల తరం నుండి వచ్చాయని నాన్ ట్రైబల్స్ అంటూ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో పలు దపాలుగా పట్టాలు కావాలని సబ్ కలెక్టర్ నుండి కమీషనర్ వరకు కలుస్తున్నారు.గతంలో గ్రామసభ తీర్మాణం కూడా జరిగింది, కానీ పట్టాలు ఇవ్వలేదు.
అల్లూరి సీతరామరాజు జిల్లా ఏర్పడిన తర్వాత జిల్లా కలెక్టర్ గా కొత్తగా వచ్చిన ఎఎస్ దినేష్ కుమార్ ని కలిసి ఆ భూములు మావేనని,పట్టాలివ్వాలని గ్రీవెన్సీలో నాన్ ట్రైబల్స్ కోరడంతో విచారణ చేయాలని కలెక్టర్ ఆదేశించారని,ఇదే విషయం పై మేం కలెక్టర్ ని అడగగా భూములు మావేనని నాన్ ట్రైబల్స్ అంటున్నారు కాబట్టి విచారణ జరపమని ఆదేశించమని అన్నామన్నారు. నిజంగా ఆ భూములు నాన్ ట్రైబల్స్ వి అయితే ఇన్ని సంవత్సరాలు,ఇంతమంది అధికారులు ఎందుకు పట్టాలివ్వలేదు.1917,1959,1970లలో చేసిన భూబదాలయింపు నిషేధ చట్టాలను ఆధారం చేసుకొని షెడ్యూల్డ్ ప్రాంతంలో భూములను కాపాడాలని, “ఆదివాసి జెఎసి “కలెక్టర్ని కోరామన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App