TRINETHRAM NEWS

రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 భారతీయులు దుర్మరణం.. కనిపించికుండాపోయిన మరో 16మంది!

Trinethram News : ఉక్రెయిన్‌లో యుద్ధంలో పోరాడేందుకు రష్యా సైన్యంలో చేరిన 126 భారతీయుల గురించి ప్రభుత్వానికి తెలుసునని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MEA) శుక్రవారం (జనవరి 17) తెలిపింది. మాస్కోలోని భారత రాయబార కార్యాలయానికి సమాచారం ప్రకారం 96 మంది ఇప్పటివరకు స్వదేశానికి తిరిగి వచ్చారు. మిగిలిన వారిలో 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 16మంది అచూకీ తెలియాల్సి ఉంది.

రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఇదిలావుండగా, రష్యా సైన్యంలో పనిచేస్తున్న 16 మంది భారతీయులు అదృశ్యమైనట్లు భారత్‌కు రష్యా అధికారులు తెలియజేశారని భారత విదేశాంగ శాఖ శుక్రవారం వెల్లడించింది. రష్యా ఆర్మీలో పనిచేస్తున్న భారతీయ పౌరులను వెనక్కి పంపాల్సిందిగా అభ్యర్థించినట్లు మంత్రిత్వ శాఖ తెలిపింది. రష్యా సైన్యంలో పనిచేస్తున్న 12 మంది భారతీయులు ఇప్పటివరకు మరణించారని పేర్కొంది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మాట్లాడుతూ, రష్యన్ సైన్యంలో పనిచేస్తున్న 126 మంది భారతీయ పౌరుల్లో 96 మంది భారతదేశానికి తిరిగి వచ్చారు. రష్యా సాయుధ దళాల నుండి విముక్తి పొందారు. రష్యా సైన్యంలో ఇంకా 18 మంది భారతీయ పౌరులు ఉన్నారని, వారిలో 16 మంది ఆచూకీ తెలియరాలేదు.. వారిని రష్యా మిస్సింగ్ కేటగిరీలో ఉంచిందని జైస్వాల్ తెలిపారు. ఇంకా సైన్యంలో ఉన్న వారిని విడిపించి వెనక్కి పంపాలని భారత్ తరుఫున డిమాండ్ చేస్తున్నామని వెల్లడించారు.

ఇటీవల, రష్యా – ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధంలో కేరళకు చెందిన భారతీయ పౌరుడు మరణించిన విషయం తెలిసిందే. కేరళలోని త్రిసూర్‌కు చెందిన 32 ఏళ్ల బినిల్ బాబు రష్యా ఆర్మీలో రిక్రూట్ అయ్యి ఉక్రెయిన్‌కు వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ విషయాన్ని రష్యా ప్రభుత్వంతో సంప్రదించింది. రష్యా ఆర్మీలో ఉన్న దేశం నుండి ఇతర వ్యక్తులను త్వరలో భారత్‌కు పంపాలని భారతదేశ డిమాండ్‌ను పునరుద్ఘాటించిందని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అంశానికి సంబంధించి, గత ఏడాది ఆగస్టులో, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మాట్లాడుతూ, రష్యా సైన్యం సేవలో ఉన్న భారతీయ పౌరుడిని సేవ నుండి తొలగిస్తామని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ నుండి తనకు హామీ లభించిందని చెప్పారు. ఈ మొత్తం విషయంలో భారతదేశ వైఖరి ఇప్పటికే స్పష్టంగా ఉందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App