TRINETHRAM NEWS

యువగళం – నవశకం విజయవంతం

మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు

నందిగామ : నందిగామ పట్టణం కాకాని నగర్ నందు మాజీ శాసనసభ్యురాలు శ్రీమతి తంగిరాల సౌమ్య గారు వారి కార్యాలయంలో గురువారం నాడు నిన్న భోగాపురం మండలం పోలేపల్లి గ్రామంలో యువగళం – నవశకం సభ విజయవంతం కావడంతో ఒక ప్రకటనలో మాట్లాడుతూ…

కామెంట్స్..

యువగళం నవశకం వేడుకకు 5 లక్షల మందికి పైగా జనసందోహం హాజరై కార్యక్రమం గ్రాండ్ సక్సెస్ అయ్యింది.

నిన్న జరిగిన పోలేపల్లి యువగళం – నవశకం చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడింది

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ గారు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారు, టీడీపీ ఎమ్మెల్యే, పొలిట్ బ్యూరో సభ్యుడు నందమూరి బాలకృష్ణ గార్లను ఒకే వేదికపై చూసిన తర్వాత వైఎస్సార్సీపీలో ఓటమి భయం మొదలైంది.

జగన్ పనైపోయింది.జగన్ రెడ్డికి ప్రజాక్షేత్రంలో దారులు మూసుకుపోయాయి

యువగళం పాదయాత్ర ముగింపు కాదు, ఇది ఒక నూతన నవశకం ప్రారంభాన్ని సూచిస్తుంది. సీఎం జగన్మోహన్రెడ్డి తాడేపల్లి రాజభవనం తలుపులు బద్దలుకొట్టే వరకు సాగే యుద్ధం ఇది.

తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లుగా టీడీపీ, జనసేన పొత్తు చారిత్రాత్మకం, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కు ఇది చాలా అవసరం.

టీడీపీ & జనసేన పొత్తు రెండు పార్టీల వ్యక్తిగత ప్రయోజనాల ఏర్పాటు చేసుకుంది కాదు. ఈ పొత్తు 5 కోట్ల ఆంధ్రుల భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకుంది

టీడీపీ, జనసేన పొత్తు పెట్టుకున్న రోజే వైఎస్ఆర్సీపీకి ఓటమి ఖాయమైంది

జగన్ రెడ్డి అక్రమాలకు, అవినీతికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ ముందుకు వస్తే ఈ వైకాపా అరాచక ప్రభుత్వం మూడు నెలల్లో కూలిపోతుంది.

చంద్రబాబు నాయుడు గారు విజనరీ, జగన్ రెడ్డి ప్రిజనరీ.ఇది జగన్ రెడ్డి అహంకారానికి, ఆంధ్ర ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న యుద్ధం..

జగన్ రెడ్డి విద్య, వైద్యం, రహదారులతో సహా అన్ని రంగాలను నాశనం చేసి,రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ను మార్చారు.

రాష్ట్ర ప్రజలకు ఉపాధి, మెరుగైన వైద్యం, మెరుగైన మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతను టీడీపీ,జనసేన తీసుకుంటాయి.

వచ్చే ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించిన తాడేపల్లి ప్యాలెస్ జగన్ రెడ్డి ఎమ్మెల్యేలను బదిలీ చేసే పనిలో పడ్డాడు

ఓటమి భయంతోనే ఎమ్మెల్యేలను బదిలీ చేసి కొత్త ముఖాలను ప్రవేశపెట్టి రాష్ట్ర ప్రజలను మళ్లీ మోసం చేయాలని ప్రయత్నిస్తున్నాడు.

2024లో ఆంధ్రప్రదేశ్లో మార్పు అత్యవసరం. ఆ మార్పు తీసుకురావడానికి టీడీపీ-జనసేన ప్రభుత్వం ఏర్పాటు అవుతుంది.

చంద్రబాబు నాయుడు గారు లాంటి విజన్ ఉన్న నాయకుడు కావాలి.