జూలై 17, 2026
TRINETHRAM NEWS

గంగాధర నెల్లూరు నియోజకవర్గంఇంచార్జి. త్రినేత్రం న్యూస్. ఎగువ కమ్మ కండ్రిగ పంచాయతీ., మిట్ట హరిజన వాడ గ్రామం., నిన్నటి మధ్యాహ్నం అడవికి నిప్పు పెట్టడం వల్ల పక్కనే ఆనుకుని ఉన్న షణ్ముగం అనే రైతుకి చెందిన 5 ఎకరాల చెరుకు తోట దగ్ధమైంది.,

కుటుంబం మొత్తం అక్కడే నివాసం ఉండటం వల్ల బట్టలు, 50 కేజీ ల బస్తాలు 100, బెల్లం తయారు చేసే సామాగ్రిలు, మూడు సెల్ ఫోన్లు, రేషన్ కార్డులు,ఆధార్ కార్డులు, బ్యాంక్ పాస్బుక్కులు, పట్టాదారు పాసుపుస్తకాలు మొదలగునవి మంటల్లో కాలిపోయింది. రెవిన్యూ అధికారులు 11,26,000-00 ( 11 లక్షల 26 వేల రూపాయలు) నష్టం వాటిల్లిందని రిపోర్టు తయారు చేశారు
ఈ ప్రదేశాన్ని సందర్శించి, పరిశీలించి … తక్షణసాయంగా బట్టల కొనుగోలుకు జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఐదు వేల రూపాయలు (5000/-) ఆర్థిక సహాయం అందించి జనసేన పార్టీ జీడీ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి మరియు ఏపీ మాల వెల్ఫేర్ కోపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ స్టేట్ డైరెక్టర్ డాక్టర్ యుగంధర్ పొన్న.

ఈ విషయాన్ని కూటమి ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ డాక్టర్ వి.ఎం థామస్ కు చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు డిస్టిక్ మెజిస్ట్రేట్ సుమిత్ కుమార్ దృష్టికి మరియు కూటమి ప్రభుత్వం తరఫున రావలసిన ప్రతి ప్రయోజనం వారికి అందేటట్లు ఈ కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎస్ ఆర్ పురం మండల అధ్యక్షులు చిరంజీవి, జిల్లా సంయుక్త కార్యదర్శి రాఘవ, నియోజకవర్గ యువజన అధ్యక్షులు సుమన్, జనసైనికులు గ్రామస్తులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Yugandhar Ponna visited the farmer

You cannot copy content of this page