
త్రినేత్రం న్యూస్ పెనుమూరు మేజర్ న్యూస్. చిత్తూరు జిల్లా కలెక్టర్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ ను కలిసి విజ్ఞాపన పత్రం సమర్పించిన ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ మాల కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు జనసేన పార్టీ గంగాధర్ నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ యుగంధర్ పొన్న. పా లసముద్రం మండలంలో కన్యకాపురం బీసీ కాలనీకి చెందిన స్మశాన వాటికను దురాక్రమం నుండి ప్రభుత్వ భూమిని కాపాడండి.
తెల్ల గుండ్లపల్లి గ్రామస్తులకు నీటి ట్యాంక్ నిర్మాణం చేపట్టాలని, కొట్టారువేడు గ్రామంలో సామాన్య రైతు భూమిని కాపాడాలని కోరారు. సదరం క్యాంపు ఏప్రిల్ 1వ తేదీ నుంచి నిర్వహించు చున్న నేపథ్యంలో నియోజకవర్గంలోని దివ్యాంగులకు వృద్ధులకు సమాచారం ఇళ్ల వద్దకే చేరే విధంగా చూడాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు మండల అధ్యక్షుడు శ్రీనివాసులు, రాఘవ రాజేష్, ఎస్సార్ పురం మండల అధ్యక్షుడు చందు ముత్తుకుమార్ బూత్ కన్వీనర్ సురేష్ రెడ్డి పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
