వైసీపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ట్వీట్..
ఇంతకంటే సిగ్గుచేటు విషయం ఇంకేమన్నా ఉంటుందా?
అన్నింటిలో నీచ రాజకీయాలు ఆడుతున్న వైసీపీ వాళ్ళు,ఇప్పుడు క్రీడలపై కూడా వారి దౌర్భాగ్య రాజకీయాలను,అధికారమదాన్ని చూపుతున్నారు.
రాష్ట్రప్రతిష్ఠను అన్నివిధాలుగా నాశనం చేసిన వీళ్ళు ఇంకా ఎంత లోతులకు దిగజార్చుతారో మనం ఊహించలేము.
ఆడుదాం ఆంధ్ర అంటూ రెండు నెలలు సినిమా స్తంట్స్ చేయించిన వైసీపీ నేతలు,అసలు ఆడుతున్న ఆటలు ఇవేనా?
ఆటగాళ్ల భవితను,ఆత్మవిశ్వాసాన్ని ఇలా నాశనం చేస్తారా? ఇది ఆంధ్ర క్రికెట్ అస్సోసియేషనా లేకా అధ్వానపు క్రికెట్ అస్సోసియేషనా?
ఈ విషయంపై వెనువెంటనే నిస్పాక్షికమైన విచారణ జరగాలి అని కాంగ్రెస్ డిమాండ్ చేస్తున్నది..క్రీడలపై వైసీపీ క్రీనీడలు తీవ్రంగా ఖండిస్తున్నాము..
ఇంకెన్ని దిగజారుడు ఆటలు ఆడతారు వీళ్ళు?