TRINETHRAM NEWS

యువత క్రీడలు పట్ల అసక్తి పెంచుకోవాలి

క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం

మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

యువత క్రీడలు పట్ల అసక్తి పెంచుకోవాలనీ, క్రీడలతో మానసిక శారీరక దృఢత్వం పెరుగుతుందని రామగుండం మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ అధ్యక్షుడు కోరుకంటి చందర్ అన్నారు. శుక్రవారం జనగామ 9 వ డివిజన్ లో నిర్వహించిన కోరుకంటి ప్రిమియర్ లీగ్ ముగిసాయి. ప్రధాన కార్యక్రమం ముఖ్య అతిధిగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ క్రికెట్ పోటీల విజేతలకు ప్రధమ బహుమతి ఖని స్థార్ టీంకు 20 వేలు, రెండవ బహుమతి కింగ్స్ 8 టీంకు 10 వేల 3 వ బహుమతి బద్రిపల్లి టీంకు 5 వేలు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడల ఆడటం ముాలంగా మానసిక ఉల్లసం కలుగుతుందని యువత క్రీడలు ఆడటం తమ అలవాటు చేసుకోవాలన్నారు. క్రీడల్లో రాణిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు పోందే అవకాశాలున్నాయన్నారు.

రామగుండం నియోజకవర్గం లోని క్రికెట్ క్రీడకారులను తమ వంతుగా ప్రోత్సాహం అందిస్తున్నమని తెలిపారు. ఈ కార్యక్రమం లో కార్పోరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, జనగామ కవిత సరోజిని జేవి రాజు టోర్నమెంట్ నిర్వహకులు జితేందర్ నాయకులు నారాయణదాసు మారుతి బోడ్డుపల్లి శ్రీనివాస్ తోకల రమేష్ ఇరుగురాళ్ల శ్రావన్ కల్లేవేని రవి చింతకింది సంపత్ పోట్యాల రమేష్ జనగామ మహేందర్ అనిల్ పటేల్ తిరుపతి వెంకన్న రామరాజు అవునూరి కిరన్ జీ అతరోద్ధిన్ సారయ్య నాయక్ ప్రదీప్ సమ్మెట స్వప్న తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App