
ప్రపంచ రికార్డు సాధనకు కృషి
జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్
ఆంధ్రప్రదేశ్ అల్లూరి జిల్లా అరకు నియోజవర్గం,అరకువేలి మార్చి 30 : ఏప్రిల్ ఏడవ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం పురష్కరించుకుని 20 వేల మంది విద్యార్ధినీ విద్యార్థులతో 108 సూర్య నమస్కారములు యోగాభ్యాసన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఎఎస్ దినేష్ కుమార్ స్పష్టం చేసారు. శనివారం యోగ సాధన చేయనున్న అరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానాన్ని పరిశీలించిన కలెక్టర్ ఏర్పాట్లపై దిశా నిర్దేశం చేసారు. ఎంత మేర మైదానాన్ని వినియోగించాలి. తిలకించడానికి వచ్చే ప్రజలు వేచి ఉండాల్సిన స్థలం, విద్యార్థుల కోసం ఏర్పాటు చేయనున్న బస్సుల పార్కింగ్, విఐపీ పార్కింగ్, ద్విచక్ర వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు పరిశీలించి తగు సూచనలు జారీ చేసారు.
ఈ సందర్భంగా మైదానంలో ఉన్న చిన్న కాలువను సిమెంట్ పైపులుతో డ్రైనేజ్ సౌకర్యం కల్పించి మరింత మైదానాన్ని వినియోగంలోకి తీసుకురావాలని గిరిజన సంక్షేమ ఇఇని ఆదేశించారు. అదేవిధంగా విద్యార్ధుల తరలింపు, వారి భోజన సదుపాయాలు, మంచి నీటి ఏర్పాటు, ఓఆర్ఎస్ పికెట్లు సిద్ధం చేయాలని గిరిజన సంక్షేమ డిడి, డిఇఓ, ఎపిసి, ఆర్టీసి, రవాణా శాఖ, పౌర సరఫరాల అధికారులకు అప్పగించారు. మైదానం నలుమూలలా వైద్య శిభిరాలు ఏర్పాటు చేయాలని, విద్యార్థులు డిహైడ్రేషన్ కు గురి కాకుండా చూడాలని వైద్య శాఖాధికారులను, అవసరమైన అన్ని ప్రాంతాలలో లైటింగ్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులను ఆదేశించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ ను కలసిన పాత్రికేయులతో మాట్లాడుతూ, యోగా కార్యక్రమం ద్వారా విద్యార్ధులలో చైతన్యం నింపటమే కాకుండా వారి మానసిక, శారీరక దేహ ధారుడ్యానికి ఉపయోగ పడుతుందని, అంతే కాకుండా చలి ఉత్సవాల నిర్వహణ ద్వారా పర్యాటక రంగ పరంగా పర్యాటకులు పెరిగినట్లే ఈ కార్యక్రమం ద్వారా పర్యాటకుల పెంపునకు కృషి చేస్తున్నామని చెప్పారు. అదేవిధంగా సింగల్ యూస్ ప్లాస్టిక్ ను ఏప్రిల్ ఒకటి నుండి నియంత్రించే చర్యలలో భాగంగా ఇప్పటినుండి చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసారు.
ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ సౌర్యమన్ పటిల్, గిరిజన సంక్షేమ డిడి ఎల్. రజని, ఎన్డీసీ లోకేష్ కుమార్, ఇఇ కె. వేణుగోపాల రావు, డిఇఓ పి. బ్రహ్మాజీ రావు, ఎసిపి స్వామి నాయుడు, గురుకుల సంస్థల ఓఎస్టి పీఎస్ఎన్ మూర్తి, ఆర్టిసి డీఎం ఉమా మహేశ్వర రావు, రావాణాశాఖాదికారి లీలా ప్రసాద్, డిపిఆర్ గోవింద రాజులు, యోగ గురువు పతంజలి శ్రీనివాస్, స్థానిక అరకు తహసీల్దార్, ఎంపిడిఓ, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
