TRINETHRAM NEWS

శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధి కోసం ఎంతటి చర్యలు ఐనా తీసుకుంటాం – వైఎన్ శాస్త్రి

శ్రీకాకుళం జిల్లాలో క్రికెట్ అభివృద్ధికి ముందడుగు వేస్తున్నట్లు జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు వైఎన్ శాస్త్రి తెలిపారు.ఆదివారం శ్రీకాకుళం లోని ఒక ప్రైవేట్ హోటల్లో జిల్లా క్రికెట్ సంఘం కార్యవర్గ సమావేశం జరిగింది.

ఈ సమావేశంలో గత ఏడాదిగా ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ రాష్ట్ర స్థాయి, రంజీ స్థాయి పోటీలకు ఎంపికైన 9 మంది క్రీడాకారులకు ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ సంఘం కార్యవర్గ సభ్యులు, కార్యదర్శులు పాల్గొన్నారు.