TRINETHRAM NEWS

శ్రీరంగం ఫౌండేషన్ కో-చైర్‌పర్సన్ ఇందుమతి శ్రీరంగం.

కూకట్ పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 7 : మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తూ సమాజంలో తమ ప్రతిభను నిరూపించాలని శ్రీరంగం ఫౌండేషన్ కో-చైర్‌పర్సన్ ఇందుమతి శ్రీరంగం అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆమె మాట్లాడుతూ శ్రీరంగం ఫౌండేషన్ కో-చైర్‌పర్సన్, శ్రీరంగం గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, న్యాయవాది అయిన ఆమె, అద్భుతమైన మహిళలకు తన సందేశం తెలియపరుస్తూ వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమే అన్నారు.

ప్రతి మహిళా ముందుకు వచ్చి, తన ప్రతిభను ప్రదర్శించి, తన అభిరుచులు, సిద్ధాంతాలు, నైపుణ్యాల్లో తన సామర్థ్యాన్ని నిరూపించుకోవాలన్నారు. ఇది మీరు అభివృద్ధి చెందాల్సిన సమయం, అంతేకాదు మహిళలు ధైర్యంగా, బలంగా ఉండి ఒకరినొకరు ప్రోత్సహిస్తూ, మద్దతుగా నిలవాలని కోరారు. మనమందరం పరస్పరం ఉత్తేజాన్ని పొందుతూ, కలిసికట్టుగా ఎదగాలని ఆమె మనసారా కోరుకుంటూ సమస్త మహిళా లోకానికి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App