
గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గోరంట్ల…
సంఘ అధ్యక్ష కార్యదర్శులుగా ఆంజనేయులు, తులసీదాస్… ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను మత్స్యకార కుటుంబాలకు అందజేసి వారి అభ్యున్నతకు కృషి చేస్తానని రాజమహేంద్రవరం రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి పేర్కొన్నారు. స్థానిక పుష్కరాల రేవులో గోదావరి బోటు మత్స్యకారుల సంక్షేమ సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి గోరంట్ల హాజరయ్యారు. సంఘ అధ్యక్షులుగా మల్లాడి ఆంజనేయులు, కార్యదర్శిగా పాలెపు తులసీదాస్, ఉపాధ్యక్షులుగా మల్లాడి సతీష్, సంయుక్త కార్యదర్శిగా మల్లాడి సుబ్బు, కోశాధికారిగా నాటి రామకృష్ణ, సభ్యులుగా బాలసడి ధర్మారావు, ఆకుల ఈదులయ్య, పాలెపు శ్రీను, మల్లాడి సూర్యరావు,
పెమ్మడి పోసియలు ప్రమాణస్వీకారం చేశారు ఆ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ మత్స్యకారుల నిత్యం గోదావరి, సముద్ర గర్భంలోకి వెళ్లి ప్రమాదకరమైన పరిస్థితులను ఎదుర్కొంటూ చేపలు వేటాడుతున్నారని, వారిని అన్ని విధాలుగా ఆదుకోవాల్సిన బాధ్యత తమపై ఉందన్నారు. ప్రభుత్వం ద్వారా అమలు చేసే అనేక సంక్షేమ పథకాలను అందించే విధంగా కృషి చేస్తానని, మత్స్యకారులు తమ పిల్లలను వేటకు పంపకుండా బాగా చదివించాలని సూచించారు. బాగా చదువుకుంటే రిజర్వేషన్ ద్వారా ఉద్యోగాలు లభిస్తాయని, జీవితంలో ఉన్నతంగా ఎదిగే విధంగా ఆలోచన చేయాలని తెలిపారు. అనంతరం నూతన కార్యవర్గం ఎమ్మెల్యే గోరంట్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
