సత్యవేడు వైసీపీ లో అసలేం జరగబోతోంది.? *
2024 ఎన్నికలకు వైసీపీ టికెట్ ఆశావాహులు ఎవరు?.
సత్యవేడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా కోనేటి ఆదిమూలం 44 వేల పైచిలుకు మెజారిటీతో 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున గెలుపొందారు. ఈయన నిత్యం పర్యటనలు, ప్రజల్లో వుంటూ,తన పరిధిలో తన పని తాను చేసుకుంటూ పోతున్నారు. నియోజకవర్గం లో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం కూడా ఈయన సొంతం.స్వతహాగా దళిత ఉద్యమాలు నడిపిన చరిత్ర ఉంది,. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంచి రాజకీయ సంబంధాలు కలిగి ఉన్నారు కానీ మండల స్థాయిలో పదవులు అధికారాలు అన్ని ఒకటి రెండు కుటుంబాల చేతిలో పెట్టి పార్టీలో ఏకచత్రాధిపత్యాన్ని ప్రోత్సహించి కార్యకర్తలకు కాస్త దూరమయ్యారని ఘాటు గా వినిపిస్తోంది. సత్యవేడు నియోజకవర్గం ఇద్దరు కీలక వ్యక్తులు చేతుల్లోనే ఉందని మండలాల్లో కూడా ఆ బి. ఎన్ కండ్రిగ పెద్దాయన పెత్తనం ఏంటని స్థానిక పార్టీ శ్రేణులు లోలోపల రగిలిపోతున్నారు.
ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మీద వైసీపి అధినేత జగన్ కు సానుకూల అభిప్రాయం ఉన్న వయో భారం దృష్ట్యా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీలో జరుగుతున్న అభ్యర్థుల స్థాన చలనం మరియు మార్పులు నేపథ్యంలో ఇక్కడ అభ్యర్థి మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే కుమారుడు కోనేటి సుమన్ కూడా ఈసారి అదృష్టాన్ని పరీక్షించుకోవాలని చూస్తున్నారు. ఎమ్మెల్యే ఆదిమూలం తనకుమారునికి టికెట్ ఇవ్వమని పార్టీని కోరినట్లు, ఆ విషయం తనకు వదిలేయమని జగన్ చెప్పినట్లు సమాచారం.
సరైన ప్రత్యాన్మాయ స్థానిక అభ్యర్థి కోసం నియోజకవర్గాన్ని జల్లెడ పడుతున్న పార్టీ అధిష్టానం ,అనూహ్యంగా వేలూరు రాకేష్ అనే కొత్త అభర్ధిత్వాన్ని తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తుందని తాడేపల్లిలో వినిపిస్తున్న టాక్ .పార్టీకి వైసీపీ అధినేతకు విధేయుడు కావడం, చదువుకున్న యువకుడు,పార్టీ అనుబంధ విభాగాలలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న మరియు పూర్తిగా స్థానికులు కావడం వేలూరు రాకేష్ గారికి కలిసొచ్చే అంశాలే. ఇటీవల ముఖ్యమంత్రి తిరుపతి పర్యటన సందర్భంగా ప్రత్యేకంగా పిలిపించుకొని ,మాట్లాడి అభినందించినట్లు తెలిసింది .విజయవాడ నుండి పార్టీ ముఖ్య నేత కుమారుని అండదండలు పుష్కలంగా వున్నాయి.సోషల్ మీడియాలో కూడా మంచి ఫాలోయింగ్ తో ప్రతి పక్ష పార్టీ కు ధీటుగా సమాధానాలు ఇస్తున్న వ్యక్తిగా అందరికి తెలిసిన వ్యక్తి.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ముఖ్య నేతలతో సత్సంబంధాలు కలిగి ఉండడం, నియోజకవర్గ స్థాయిలో ఏడు మండలాల్లో పరిచయాలు&బంధు వర్గం కలిగి ఉండడం కూడా వేలూరు రాకేష్ అభ్యర్థిత్వానికి బలం చేకూరుస్తున్నాయి.
ప్రస్తుతం తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి మద్దెల గురుమూర్తి పేరు అడపాదడప వినబడిన ఎంపీ గా నే కొనసాగున్నారు. ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు చెబుతున్నారు.
∆*మొత్తానికి 2024 వైసీపీ టికెట్ సిట్టింగ్ కా!?,ఎమ్మెల్యే కుమారుడి కా!?,లేకపోతే తిరుపతి ఎంపీ లాగా మరో విదేతకు పట్టం కడతార! అనేది రాబోయే రోజుల్లో తెలవనుంది…….