
అల్లూరిజిల్లా త్రినేత్రం న్యూస్ మార్చి 2 : ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ, లోత రామారావు కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, సంక్షేమం మరిచిన రాష్ట్ర బడ్జెట్ కే-టాయింపులు, ఏజెన్సీ డోలీ మోతలకు నిధులు ఎక్కడ.
పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితులకు తీవ్ర అన్యాయం, జివో నంబర్ 3 ఏజన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు హామీలేని బడ్జెట్, అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధరలు జీ సి సి అభివృద్ధికి కేవలం 20 లక్షలు రూపాయిల మాత్రమేనా? ఇంటింటి రేషన్ పంపిణీకి రూపాయి కేటాయించలేదు,రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ,జనసేన,బిజెపి కూటమి ప్రభుత్వం 3.22 లక్షల కోట్లు రూపాయిలతో ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేటాయింపులో ఆదివాసులకు తీవ్ర అన్యాయం జరిగిందని ఆదివాసి గిరిజన సంఘం.
రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు లోతరామరావు కిల్లో సురేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు పోలవరం ప్రాజెక్టునిర్మాణంలో రెండున్నర లక్షల మంది నిర్వాసితులకు 18 746 కోట్లరూపాయిలు అవసరం కాగా బడ్జెట్లో కేవలం కేటాయించింది 1424 కోట్లు రూపాయిలు మాత్రమే గిరిజన సంక్షేమానికి గత బడ్జెట్ లో 4,561 కోట్లు కేటాయించి ప్రస్తుత బడ్జెట్ లో 4671 కోట్లు రూపాయిలు కేటాయించి కేవలం 129 కోట్లు రూపాయిలు మాత్రమే ఎక్కువ కేటాయించారు గిరిజన విద్యాకి గతంలో 948 కోట్లు కేటహించగా ప్రస్తుతం కేవలం 945 కోట్లు మాత్రమే కేటాయించారు.
అటవీ ఉత్పత్తులు గిట్టుబాటు ధరలు కల్పనను జీ జి సి అభివృద్ధికి కేవలం 20 లక్షలు రూపాయిలు మాత్రమే కేటాయించి జి సి సి కి నిధులు లేకుండ చేశారు ఇంటింటి రేషన్ పంపిణీకి రూపాయి నిధులు కేటాయించలేదుఏజెన్సీ ప్రాంతంలో డొలిమొత లేని గ్రామాలే లక్ష్యంగా పనిసేస్తున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,ఉపముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటనకు బడ్జెట్ కేటాయింపులో ఎక్కడ కనిపించలేదు
బడ్జెట్ సమావేశంలో జివో నంబర్ 3 ఏజన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ విడుదలకు ఏటువంటి ప్రకటనలు లేదు ఆదివాసీలకు విద్య వైద్యం, మౌలిక వసతులు కల్పినకు గిరిజన సంక్షేమనికి బడ్జెట్ కేటాయింపులో తీవ్ర అన్యం జరిగింది
సూపర్ సిక్స్ అమలులో భాగంగా నిరుద్యోగ భృతి,డ్వాక్రా మహిళలకు నెలకు 1500 రు ఉచిత బస్ సౌకర్యం కల్పనను బడ్జెట్ లో ప్రస్తావన లేదని రెవిన్యూ లోటు భర్తీ పేరుతో భవిష్యత్ లో ప్రజలకు బారలు మరింత పెంచెవిధంగా బడ్జెట్ కేటాయింపులు ఉన్నదని ప్రభుత్వాన్ని ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర కమిటివిమర్శించింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
