TRINETHRAM NEWS

మండపేట : త్రినేత్రం న్యూస్. మోటర్ సైకిల్ నడిపే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని మండపేట టౌన్ సిఐ దారం సురేష్ పేర్కొన్నారు.మండపేట పట్టణంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ పై అవగాహన కల్పించే కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ క్రమంలో మండపేట పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ దారం సురేష్ ఎస్ఐ జి చంటి లు ద్విచక్ర వాహనదారులను తనిఖీ చేశారు.

ఈ తనిఖీ చేసే క్రమంలో హెల్మెట్ ఉపయోగించని కొంతమంది వాహనదారులకు ఫైన్ విధించకుండా ఫైన్ చెల్లించే నగదుతో వారికి హెల్మెట్లు కొనిచ్చారు. అనంతరం సర్కిల్ ఇన్స్పెక్టర్ దారం సురేష్ మాట్లాడుతూ వాహనదారులకు హెల్మెట్ తప్పనిసరిగా ఉపయోగించాలని పేర్కొన్నారు. హెల్మెట్ అనేది వారి కుటుంబానికి కూడా శ్రీరామరక్ష లాంటిదని సూచించారు. ప్రతి ఒక్క వాహనదారుడు హెల్మెట్ ఉపయోగిస్తే రోడ్డు ప్రమాదాల సంభవించే మరణాలు అరికట్టవచ్చని ఆయన అన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Wearing a helmet is