TRINETHRAM NEWS

ములుగు నియోజక వర్గం

-పంచాయితీ రాజ్ శాఖ నుండి 182 కోట్ల రూపాయల తో అభివృద్ధి పనులు ప్రారంభించాం పనులు పూర్తి
కావస్తున్నయి

-ములుగు నియోజక వర్గం లో సుమారు ప్రత్యేక అభివృద్ధి నిధులు 6 కోట్ల రూపాయల తో అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టడం జరిగింది

-అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు :: పంచాయతీ రాజ్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క

గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలు అని , గ్రామాలు అభివృద్ధి చెందినపుడే దేశం అభివృద్ధి చెందుతుంది అని మంత్రి సీతక్క అన్నారు.

ములుగు మండలం లో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంఖుస్థాపన చేశారు.
-జగ్గన్న పేట గ్రామం లోని పుట్ట మల్లన్న ఆలయ ప్రహరి గోడ మరియు సీసీ రోడ్ 10 లక్షల రూపాయల నిధులతో శంకుస్థాపన చేశారు.అనంతరం గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ప్రహరి గోడ 10 లక్షల రూపాయల నిధులతో నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.మరియు బోరు మోటార్ చిన్న గుంటూరు పల్లె లో 5 లక్షల రూపాయల నిధులతో సీసీ రోడ్లు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

-కాసిందేవిపేట గ్రామం లో 5 లక్షలు రూపాయల సీసీ రోడ్డు నిర్మాణం , 10 లక్షలతో యాదవ సంఘం కమ్యూనిటీ హాల్,10 లక్షల తో రామాలయానికి 10 లక్షలతో ప్రహరీ నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు

-జంగాల పల్లి 5 లక్షలతో పెద్దమ్మ గుడి నుండి స్మశాన వాటిక కు సీసీ రోడ్,
5 లక్షలతో మజీద్ కాంపౌండ్ వాల్ నిర్మాణానికి మరియు
మహిళ కమ్యూనిటీ హాల్,
ప్రారంభం,మరియు యాదగిరి ఇంటి నుండి మంచి నీళ్ళ బావి వరకు సీసి రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

-ఇంచర్ల గ్రామములో 5 లక్షల తో సీసీ రోడ్డు,మరియు బిరన్న గుడి కాంపౌండ్ వాల్,
అంగన్వాడీ మరమ్మతులకు నిర్మాణానికి శంకుస్థాపన

-ములుగు పట్టణ కేంద్రములో
10 లక్షల తో మహిళా కమ్యూనిటీ హల్ శంకుస్థాపన
8 లక్షలతో హమాలీ కమ్యూనిటీ హల్ శంకుస్థాపన
5 లక్షల తో ఒడ్డెర వాడ లో హన్ మాన్ గుడి కాంపౌండ్ వాల్ కు శంకుస్థాపన చేసిన రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు డాక్టర్ దనసరి అనసూయ సీతక్క

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 150 కోట్ల రూపాయల నిధులతో గ్రామాలలో నీటి వనరులు పెంచడం కోసం ప్రత్యేక ప్రణాళికలతో ప్రతిపాదనలు సిద్ధం చేశాం అని చాలా గ్రామంలో అంతర్గత రోడ్ లు లేకపోవడం తో ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు అని వారి ఇబ్బందులు దృష్టిలో ఉంచుకొని ములుగు నియోజక వర్గం లో సుమారు 15 కోట్ల రూపాయల తో సీసీ రోడ్లు,
కమ్యూనిటీ హల్ లు,గుడి బడుల నిర్మాణాలు చేయడం జరుగుతుందని అన్నారు.