
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ పారిశ్రామిక వాడకు భూములను ఇచ్చేందుకు సమ్మతించిన రైతులకు ఒకే దఫాలో నష్ట పరిహారాన్ని అందించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
గురువారం కలెక్టరేట్ లోని సమావేశం మందిరంలో పారిశ్రామిక వాడ ఏర్పాటు కోసం అసైన్డ్ భూములకు సంబంధించిన దుద్యాల్ మండలం లగచర్ల గ్రామ రైతులతో కలెక్టర్ ప్రతీక్ జైన్ చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ… పారిశ్రామిక వాడకు భూములను ఇచ్చేందుకు సమ్మతించిన రైతులకు చెక్కుల రూపంలో నష్టపరిహారంతో పాటు అప్రూవ్ లేఅవుట్ ప్రకారం ఇంటి స్థలాలను కేటాయించడం జరుగుతుందన్నారు.
భూసేకరణలో ఏవైనా అభ్యంతరాలు, రైతుల సూచనలు తదితర అంశాలపై జిల్లా స్థాయి సంప్రదింపుల కమిటీ సమావేశంలో కూలంకుశంగా చర్చించడం జరిగింది. లగచెర్ల గ్రామంలోని సర్వే నెంబర్ 102 లో 36 మంది రైతులకు సంబంధించిన 58 ఎకరాల భూమి ఉందని దీనిపై రైతులతో చర్చ నిర్వహించి రైతుల సమ్మతాన్ని పొందినట్లు కలెక్టర్ తెలిపారు. ఇట్టి సర్వే నెంబర్ భూమిలో 5 మంది రైతులు మరణించగా వారి వారసులుగా సోమవారంలోగా సమ్మతి పత్రాలను అందజేయాలని కలెక్టర్ సూచించారు. ఎకరానికి 20 లక్షలు, ఎకరానికి 150 గజాల ఇంటి స్థలములో ఇందిరమ్మ ఇల్లు, అర్హతల మేరకు ఇంటికి ఒక ఉద్యోగం కల్పించనున్నట్లు కలెక్టర్ తెలిపారు.
కలెక్టర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ రెవెన్యూ లింగ్యా నాయక్, తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్, టిజిఐఐసి జోనల్ మేనేజర్ ఓ.వి.టీ. శారద, అసిస్టెంట్ జోనల్ మేనేజర్ అజీమ సుల్తానా, దుద్యాల తహసిల్దార్ కిషన్, లగచెర్ల రైతులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
