
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ ఏప్రిల్ 3 : పది సంవత్సరాల టిఆర్ఎస్ గవర్నమెంట్ లో జరిగిన అవినీతి అక్రమాలను సాక్షాధారాలతో సహా బయట పెడతామని కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ హెచ్చరించారు.హెచ్సీయూ భూముల వివాదాన్ని విద్యార్థులను ముందు పెట్టి రాజకీయాలకు వాడుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. కూకట్పల్లి శాసనసభ్యుడు మాధవరం కృష్ణారావు హెచ్ సి యు భూములపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని సీఎం ముఖ్యమంత్రిని విమర్శించడంపై ఆయన ఘాటుగా స్పందించారు.దొంగే దొంగ అన్నట్లు కృష్ణారావు తీరు ఉందన్నారు. గత 1o ఏళ్లలో కూకట్పల్లి నియోజకవర్గంలో చెరువులు కుంటలు శిఖం భూములు చివరకు నాలాలను సైతం వదలకుండా కబ్జా చేసాడని వీటన్నింటి వ్యవహారం బయటకు తీస్తామని ఎమ్మెల్యే తీరును ఎండగడతామని రమేష్ హెచ్చరించారు. కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వానికి చెందిన ప్రతి ఇంచ్ భూమిని కాపాడుకుంటున్నామని హౌసింగ్ బోర్డ్ కు చెందిన ప్రతి కాళీ స్థలానికి ఫెన్సింగ్ వేస్తున్నామన్నారు.
యూనివర్సిటీ కి చెందిన ఒక అడుగు భూమి కూడా ప్రభుత్వం తీసుకోదని విద్యార్థులు ఆందోళన విరమించాలని సూచించారు.తెలంగాణ ఉద్యమ సమయంలో ఉద్యమం పేరుతో 1200 మంది విద్యార్థులను బలిగొన్న చరిత్ర టిఆర్ఎస్ ది అని ఇప్పుడు కూడా హెచ్సీయూ విద్యార్థులను రాజకీయంగా వాడుకోవాలని చూస్తోందన్నారు.హెచ్సీయూ భూమి వివాదం పై టిఆర్ఎస్ బిజెపి విధానాలపై రమేష్ బాలానగర్లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా సంక్షేమం కోసం సీఎం రేవంత్ రెడ్డి నిరంతరం 16 గంటలు పనిచేస్తున్నారని పలు సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించారన్నారు.తెలంగణ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం రాజీవ్ యువ వికాసం, స్కిల్ యూనివర్సిటీ ద్వారా యువతకు శిక్షణ దేశంలోనే ఎక్కడా లేనివిధంగా లబ్ధిదారులకు సన్న బియ్యం పంపిణీ వంటి కార్యక్రమాలు చేపట్టిందన్నారు.
కేసీఆర్ చెప్పిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు రేషన్ కార్డులు ఇతర సంక్షేమ కార్యక్రమాలు కేవలం నోటిమాటలకే పరిమితమయ్యాయని రమేష్ విమర్శించారు. సన్న బియ్యం తో పాటు మరో 9 నిత్యావసర వస్తువుల కిట్ ను ప్రజలకు త్వరలోనే అందించనున్నట్లు ఆయన తెలిపారు. బిఆర్ఎస్ కు ఇక భవిష్యత్తులో పుట్టగతులు ఉండబోవన్నారు. ఈ సమావేశంలో కాంగ్రెస్ నాయకులు పట్లోళ్ల నాగిరెడ్డి , తూము వేణు , లక్ష్మయ్య, దండగుల యాదగిరి, పుష్ప రెడ్డి ,గోపిశెట్టి రాఘవేంద్ర, కుక్కల రమేష్, మేకల రమేష్, మధు గౌడ్, ఐజాచ్ ,శివ చౌదరి, ప్రసన్న కుమార్ తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
