TRINETHRAM NEWS

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి గోదావరిఖని పార్టీ కార్యాలయంలో సింగరేణి కాలరీస్ లేబర్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పార్టీ మాజీ కార్యదర్శి నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడుకొండలు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు పార్టీ అభిమానులు కార్యకర్తలు సహకరించాలని కోరారు. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిందని, ఈనెల మార్చి 29 నాటికి 44వ ఆవిర్భావ దినోత్సవం గోదావరిఖని టిఎన్టియుసి, తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో జెండా ఆవిష్కరించి డాక్టర్ నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలవేసి కేకు స్వీట్ పంపిణీ చేసుకోవటం జరుగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ముదిగంటి దామోదర్ రెడ్డి టిఎన్టియుసి పెద్దపల్లి పార్లమెంట్ అధ్యక్షుడు, సల్ల రవీందర్ పెద్దపల్లి పార్లమెంట్ టిఎన్టియుసి వైస్ ప్రెసిడెంట్, చిటికెల రాజలింగం సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రెటరీ,తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మాజీ కార్యదర్శి డాక్టర్ నందమూరి తారక రామారావు వీరాభిమాని గుండబోయిన ఓదెలు, పెగడపల్లి రాజనర్సు టిఎన్టియుసి సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ కోశాధికారి,
సీనియర్ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మహిళా మాజీ కార్యదర్శి నరెడ్డి స్వరాజ్యం, బరిగల కళావతి రాష్ట్ర మహిళా కార్యదర్శి, చిట్యాల అశ్విని రాష్ట్ర మాజీ మహిళా కార్యదర్శి, శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ టౌన్ అధ్యక్షుడు, బేక్కం వీరేందర్ వీరేందర్ రాష్ట్ర టిఎన్ఎస్ఎఫ్ మాజీ కార్యదర్శి, రోడ్డ బానమ్మ సీనియర్ మహిళా నాయకురాలు మాటేటి లక్ష్మి టిఎన్టియుసి రాష్ట్ర అధ్యక్షురాలు, కూసి నర్మదా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు రామగిరి రాజేశ్వరి తెలుగుదేశం పార్టీ టౌన్ మాజీ కార్యదర్శి బండారి స్రవంతి పెద్దపల్లి పార్లమెంట్ మాజీ కార్యదర్శి కామెరా రాజబాబు రామగుండం మాజీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు సుందిళ్ల స్వామి టౌన్ ఎస్సీ సెల్ కార్యదర్శి మాజీ వేల్పుల కొండ నర్సయ్య తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

TDP Foundation Day