TRINETHRAM NEWS

తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యేల లేఖలను త్వరలోనే ఆమోదిస్తాం

2 నెలల్లో టీటీడీ కొత్తబోర్డు..: ఏపీ మంత్రి సుభాశ్‌

యాదగిరి లక్ష్మీనరసింహుడిని దర్శించుకున్న వాసంశెట్టి

తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) కొత్త పాలక మండలి ఏర్పడిన తర్వాత తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫార్సు లేఖలను స్వీకరిస్తామని ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్‌ చెప్పారు. శనివారం ఆయన యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహ స్వామివారి దర్శనానికి రాగా.. అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వాసంశెట్టి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.

ఆ తర్వాత ఈవో భాస్కర్‌రావు ఆయనకు లడ్డూ ప్రసాదం, స్వామివారి చిత్రపటాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సుభాష్‌ మీడియాతో మాట్లాడుతూ.. మరో రెండు నెలల్లో కొత్త పాలకమండలి ఏర్పడనుందన్నారు. ఆ వెంటనే తెలంగాణ నుంచి వచ్చే సిఫారసు లేఖలను ఆమోదించి, దర్శన సదుపాయాలు కల్పిస్తామని తెలిపారు…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App