TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్: మహనీయుల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు.
శనివారం కలెక్టరేటలోని సమావేశం మందిరంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల సందర్భంగా సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. మహనీయుల జయంతి ఉత్సవాలను విజవంతంగా నిర్వహించేందుకు అందరి సహకారం అవసరమన్నారు. షెడ్యూల్ కులాల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే మహనీయుల జయంతి ఉత్సవాలకు అన్ని సౌకర్యాలు కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. మహనీయుల జీవిత చరిత్రలను తెలుకునేందుకు వీలుగా ప్రజా ప్రతినిధులు, ఉద్యోగులు, ప్రజలు, విద్యార్థులను భాగస్వాములను చేయాలని కలెక్టర్ సూచించారు.

ప్రతి గ్రామంలో మహనీయుల జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. భవిష్యత్తు తరాలకు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, మహాత్మ జ్యోతిభా ఫూలే జీవిత చరిత్రలు తెలుసుకునే విధంగా చిత్ర, నాటక ప్రదర్శన ద్వారా తెలిపే విధంగా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్లు లింగ్యా నాయక్, సుధీర్, ఎస్సీడీడబ్ల్యుఓ మల్లేశం, డిఎండబ్ల్యుఓ కమలాకర్ రెడ్డి, డిఐఓ శంకర్ నాయక్, దళిత సంఘాల నాయకులు రాజలింగం, కృష్ణయ్య, నర్సింలు, రామచంద్రయ్య, అశోక్ కుమార్, జగదీశ్వర్, మల్లేశం, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

We should cooperate in